జగదీష్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

91
Minister Jagadish Reddy misses Massive Road Accident

తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది… కట్టంగూర్‌ మండలం ఎరసానిగూడెం వద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం స్పల్వంగా ధ్వంసం కాగా… ఇన్నోవాలో ఉన్నఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆ కారులో లేరని, వెనకాలే వస్తున్న మరోకారులో మంత్రిగారు ఉన్నట్టు సమాచారం.
 Minister Jagadish Reddy misses Massive Road Accident
అయతే ..గాయపడినవారిలో మంత్రికి వరుసకు సోదరుడైన కరుణాకర్‌రెడ్డి, అటెండర్‌ లింగయ్య, భద్రాతాధికారి అవినాశ్‌రెడ్డి, డ్రైవర్‌ కృష్ణ, గడ్డిపల్లికి చెందిన సత్యం ఉన్నారు. వీరందరినీ సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి హైదరాబాద్‌ నుంచి కేతెపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.