బొప్పాయి తింటే.. నిజంగానే గర్భం పోతుందా?

688
- Advertisement -

మన శరీనానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను ప్రకృతి మనకు సహజ సిద్దంగానే అందిస్తుంది. ముఖ్యంగా ఆయారకాల పండ్లను తినడం వల్ల శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషకాలు అందుతాయనేది నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లపై మాత్రం సమాజంలో ఎన్నో రకాల అపోహలు ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా బొప్పాయి గురించి చెప్పుకోవచ్చు. బొప్పాయి తినడం వల్ల గర్బిణి స్త్రీలకు ప్రమాదం అని, వాటిని తినడం వల్ల గర్భం కోల్పోయే ఉందని ఎలా ఎన్నో రకాల అపోహలు మనం వింటూనే ఉంటాము. అయితే అలాంటి అపోహలు నిజమా కదా ? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. కాగా నిజంగానే బొప్పాయి పండు తినడం వల్ల గర్బిణి స్త్రీలకు ప్రమాదం వాటిల్లుతుందా ? ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయను పరిశీలిద్దాం !

బొప్పాయి పండు తినడం వల్ల గర్బిణి స్త్రీలకు నష్టాల ఏ స్థాయిలో ఉన్నాయో ఉపయోగాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఉన్న అపోహ ప్రకారం బొప్పాయి తినడం వల్ల నిజంగానే గర్భధారణ కోల్పోయే అవకాశం ఉదంట. అయితే అది అన్నీ సమయాల్లో జరగదని నిపుణులు చెబుతున్నారు. గర్భం దరించిన మొదటి నెల నుంచి మూడో నెల లోపు బొప్పాయి పండు అది కూడా కాస్త కాయ రూపంలో ఉన్న బొప్పాయి తినడం వల్ల ప్రొస్టాగ్లండింస్ అనే హార్మోన్ శరీరంలో తిన్న వారిలో ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే కాస్త కాయ రూపంలో ఉన్న బొప్పాయిలో పాల శాతం ఎక్కువగా ఉంటుంది.

ఈ పాలలో ప్రొస్టాగ్లండింస్ హార్మోన్ ను ఉత్పత్తి చేసే గుణాలు అధికంగా ఉంటాయి. ఈ హార్మోను స్త్రీ శరీరంలో గర్భసంచి గోడలు ముడుచుకుపోయేలా చేస్తుంది. తద్వారా అండాన్ని పట్టి ఉంచే సామర్థ్యాన్ని గర్భాశయం కోల్పోతుంది. దీంతో స్త్రీ గర్భం కోల్పోయే గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ గర్భంతో ఉన్న స్త్రీ ఆరు నుంచి ఏడు నెలల సమయంలో బాగా పండిన బొప్పాయి పండు తినడం వల్ల అన్నీ రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరు నెలల తరువాత గర్బిణి బొప్పాయి పండు తిన్నప్పటికి ఎలాంటి గర్భస్రావం జరిగే అవకాశం లేదని, నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బిణిలకు మొదట్లో బొప్పాయి వల్ల నష్టాలు ఉన్నప్పటికి.. తరువాత ఆ పండు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి…

ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగొచ్చిన వేళ..

ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

50నగరాల్లో 5జీ షూరూ…

- Advertisement -