బీజేపీ నేత ఈటలకు చేదు అనుభవం..

28
etela

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పాపయ్య పల్లెల్లో ఈటల రాజేందర్ కు చుక్క ఎదురైంది. పాపయ్య పల్లె గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయిన ఇంటికి పరమర్శకు వెళ్లిన ఈటలకు ఉహించని షాక్ తగిలింది.

గతంలో అదే గ్రామానికి చెందిన బాషబోయిన ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి మృతికి ఈటెల రాజేందర్ కారణమని ఆయన మీద దుమ్ము ఎత్తి పోశారు ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు. ఈటలను బండ బూతులు తిడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసుల సాయంతో అక్కడినుండి జారుకున్నారు ఈటల.