రాష్ట్రంలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం

32
ktr

రాష్ట్రంలో హరిత విప్లవం తో పాటు క్షీరవిప్లవం మొదలైందని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకసాగునీరు అందుబాటులోకి రావడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలసి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు మంగళవారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మదర్ డైరీ ని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విజయా డైరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారని ఆయన తెలిపారు.

అందులో ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ఏర్పడిన రోజు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణా ఏర్పాటుకు ముందు విజయా డైరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అటువంటి డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. యింకా ఈ కార్యక్రమంలో నార్ముల్ కు ఎన్నికయిన కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు,కోట్ల జలందర్ రెడ్డి,రచ్ఛా లక్ష్మి నరసింహా రెడ్డి,గూడూరు శ్రీధర్ రెడ్డి  చల్లా సురేందర్ రెడ్డి లతో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,టెస్కాబ్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లతో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి,శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్,ఫైళ్ల శేఖర్ రెడ్డి,బొల్లం మల్లయ్య యాదవ్,నోములభగత్,నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులుకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.