గోపీచంద్ ‘పంతం’ కొత్త ట్రైలర్..

210
Pantham Movie Trailer
- Advertisement -

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వ‌కుశ‌`వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Gopichand

ఇక గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్ పైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. “ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద పది మంది సంతకాలు పెట్టే పద్ధతి మారితేనే గాని సామాన్యుడికి ఏ సాయం అందదు”. “అవినితి చేసే ఒక నాయకుణ్ణి అరెస్ట్ చేస్తే మాత్రం బంద్‌లు చేస్తాం .. ధర్నాలు చేస్తాం .. బస్సులు తగలబెట్టేస్తాం అంటూ ప్రతి ఒక్కడూ రోడ్డుకెక్కేస్తాడు. వాడు కాజేస్తున్నది నీ అన్నాన్ని .. నీ భవిష్యత్తుని .. నీ బతుకునురా .. ” అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. వచ్చెనెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

- Advertisement -