వచ్చే ఏడాది వరకు ఆధార్-పాన్‌ లింక్ గడువుపెంపు

208
aadhar pancard
- Advertisement -

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందుకోసం ఆధార్‌తో పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డుతో పాన్‌ కార్డును లింక్ చేయాలని ఇప్పటివరకు పలుమార్లు గడువు విధించిన దానిని పొడగిస్తూ వస్తోంది కేంద్రం.

తాజాగా కరోనా నేపథ్యంలో ఆధార్‌ కార్డుతో పాన్ కార్డు లింక్‌ను మరోసారి పొడగించింది. గ‌తంలో విధించిన గ‌డువు రేపటితో ముగియ‌నున్న నేపథ్యంలో తాజాగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించింది కేంద్రం.

కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించగా కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేసుకోని వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వీలుండదు. అయితే ఈ గడువును మరోసారి పొడగించడంతో పన్ను చెల్లింపు దారులకు కాసింత ఊరట కలిగింది.

- Advertisement -