ఇది ప్రగతిశీల చర్య: అక్షయ్‌ కుమార్

44
akshay kumar

కేంద్ర హోంమంత్రిత్వ శాఖపై ప్రశంసలు గుప్పించారు సినీ నటుడు అక్షయ్ కుమార్. భారత పారామిలటరీ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ హోదాల్లో ట్రాన్‌జెండర్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇది ప్రగతి శీల చర్య అని కొనియాడారు.

దేశంలోని మిగిలిన వృత్తులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నానని….ఇది సమాజానికి ఎంతో సానుకూల సందేశాన్ని అందిస్తుందని వెల్లడించారు.

ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు అక్షయ్ కుమార్. ఆగస్టులో తన కొత్తప్రాజెక్టు బెల్ బాటమ్ చిత్రాన్ని షురూ చేస్తున్నాడు. 80వ దశకం బ్యాక్ డ్రాప్ లో వాస్తవ కథాంశంతో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రానుంది.