పది నిమిషాల్లో పాన్ కార్డు..పొందండిలా!

24
- Advertisement -

ప్రస్తుతం పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. ఏదైనా బ్యాంక్ ఖాతా తెరవాలన్న లేదా అధిక మొత్తంలో నగదు బదలీలు చేయాలన్నా, లేదా లోన్ తీసుకోవాలన్న పాన్ కార్డు తప్పనిసరి. అందుకే ప్రతి ఒక్కరు పాన్ కార్డు కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. అయితే పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలో తెలియక చాలామంది నెట్ సెంటర్ల దగ్గరకు వెళ్తుంతారు. ఇక పాన్ కార్డు అప్లై చేసిన తర్వాత కార్డు పోస్ట్ ద్వారా ఇంటికి రావడానికి కనీసం 10 నుంచి నెల రోజుల టైమ్ పడుతుంది. అయితే ఇ-పాన్ కార్డు మంజూరు కావడానికి కూడా కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇంత సమయం వెచించకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇన్స్టంట్ గా ఇ-పాన్ మంజూరు చేసే ఆప్షన్ ను తీసుకొచ్చింది. అదెలాగో చూద్దాం !

* అందుకోసం ( eportal.incometax.gov.in ) అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ instant pan through aadhaar ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఆ తరువాత get new pan ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది.
* అక్కడ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆదార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి.
* ఆ తరువాత మరికొన్ని వివరాలు అక్కడ సడ్మిట్ చేయాలి. అన్ని వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది.
* ఆ తరువాత ఇ-పాన్ విజయవంతంగా మంజూరు అవుతుంది. దీనిని pdf ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు.

ఇలా పది నిమిషాల్లోనే ఆధార్ సహాయంతో పాన్ కార్డ్ పొందవచ్చు.

Also Read:Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

- Advertisement -