Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

19
- Advertisement -

కెరీర్ మొదట్లో అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకొని ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత నుంచి విరుస పరాజయాలతో సతమతముతున్నాడు. టాక్సీవాలా కాస్త పరవలేదనిపించినప్పటికి, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ.. వంటి మూవీస్ తో భారీ ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. దాంతో విజయ్ క్రేజ్ తగ్గిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాతో ఈ రౌడీ హీరో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ” ది ఫ్యామిలీ స్టార్ “. మూవీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ గీతగోవిందం ‘ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దాంతో ఈ కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని ఏప్రెల్ 5న విడుదల చేయబోతున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమేషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల కాగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మెలోడీగా ఉండడంతో స్లో గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే మరో సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని విజయ్ పట్టుదలగా ఉన్నాడు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా సినిమాగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. మరి లైగర్, ఖుషీ వంటి మూవీస్ తో పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద డిజాస్టర్స్ చవిచూసిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ తోనైనా మంచి హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:పెసర మొలకలతో ఆరోగ్యం

- Advertisement -