పవన్ సినిమాలో పల్లవి ప్రశాంత్ ?

55
- Advertisement -

తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 7’ చివరి దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రైజ్ మనీగా రూ.50 లక్షలను గెలుచుకుంటే ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న నిన్న హౌస్ మేట్స్ కి ఎదురైంది. దీనికి సమాధానంగా పల్లవి ప్రశాంత్ తనకి ఆ డబ్బు వస్తే, పంట నష్టాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు సాయంగా ఇస్తానని, తాను రైతులకు అండగా నిలబడతానని అన్నాడు. తనకు రైతుల కష్టాలు తెలుసనీ, నష్టపోయిన రైతుల కోసమే ప్రతి రూపాయినీ కేటాయిస్తానంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అందుకు తగ్గట్టుగానే రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ సీజన్ 7 టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచాడు. పైగా, డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. దీంతో అందరు విన్నర్ రైతు బిడ్డనే అని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే రైతు బిడ్డ గురించి న్యూస్ ఒకటి వైరలవుతోంది. పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో పల్లవి ప్రశాంత్‌ నటించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఆటతీరును చూసి, దర్శకుడు హరీష్ శంకర్ ఇంప్రెస్ అయ్యి, అతనికి తన సినిమాలో అవకాశం ఇస్తున్నాడని తెలుస్తోంది.

ఇక బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం నామినేషన్‌లో అర్జున్‌ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌, శివాజీ ఉన్నారు. చివరకు శోభా, గౌతమ్‌ మిగిలారు. వీరిని హోస్ట్‌ నాగార్జున యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచి, మీ వెనక 2 బ్రీతింగ్‌ డ్రాగన్స్‌ ఉన్నాయని చెప్పారు. గౌతమ్‌ వెనక డ్రాగన్‌ బ్రీత్‌ ఆగిపోవడంతో గౌతమ్ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు.

Also Read:సీఎం ఎంపిక అధిష్టానంపైనే

- Advertisement -