తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మహిళ సంఘాలకు రూ.3000 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించటం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల రూపాయలను అందించటం జరిగిందన్నారు. మహిళల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలను అందించటం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కోరుకుంటున్నరాని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు అఖండ విజయం సాధించారని గుర్తు చేశారు.