‘ఆట నాది, రూ.కోటి మీది’- యంగ్‌ టైగర్‌

122
ntr
- Advertisement -

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ షోతో బుల్లితెర‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇటీవల‌ విడుద‌ల చేసిన ఈ షో ప్రోమోలో ఎన్టీఆర్ క‌న‌ప‌డిన షోపై ఆసక్తిని కలిగించాడు. బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో మ‌రో ప్రోమోను విడుద‌ల చేశారు.

జీవితాన్ని మారుద్దాం రామ్మా.. ఇక్కడ కథ మీది కళ మీది.. ‘ఆట నాది, రూ.కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది. ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.

- Advertisement -