ఆస్ట్రేలియాతో జరగబోయే రాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) 16 మంది సభ్యులతో కూడిన అత్యంత బలమైన జట్టును ప్రకటించింది. మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన పలువురు స్టార్ మరియు సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడంతో పాక్ జట్టు పటిష్టంగా మారింది.
బంగ్లాదేశ్ పర్యటనకు దూరమైన మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ నసీమ్ షా, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్ మరియు సుఫ్యాన్ ముఖీమ్ లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్‌కు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సల్మాన్ అలీ ఆఘా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ 16 మంది సభ్యుల జట్టులో అహ్మద్ డానియల్, అరాఫత్ మిన్హాస్ మరియు రోహైల్ నజీర్ అనే ముగ్గురు అన్‌క్యాప్డ్ (ఇంతవరకు వన్డేలు ఆడని) ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. వీరు ఈ సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా ఉస్మాన్ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో, మొహమ్మద్ గాజీ ఘోరీ, రోహైల్ నజీర్‌లను వికెట్ కీపర్-బ్యాటర్లుగా ఎంపిక చేశారు.
పాకిస్తాన్ వన్డే జట్టు:
షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), బాబర్ ఆజం, అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియల్, అరాఫత్ మిన్హాస్, హారిస్ రవూఫ్, మాజ్ సదాఖత్, ముహమ్మద్ గాజీ ఘోరీ (వికెట్ కీపర్), నసీమ్ షా, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్, షామిల్ హుస్సేన్, సుఫ్యాన్ ముఖీమ్.
Also Read:డయాబెటిస్ ముప్పు..వీటితో చెక్!
పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మే 30 నుండి జూన్ 4 వరకు వన్డే సిరీస్ జరగనుంది.మొదటి వన్డే: మే 30 (రావల్పిండి),రెండూ వన్డే: జూన్ 2 (లాహోర్),మూడో వన్డే: జూన్ 4 (లాహోర్)లో జరగనుంది.

