అశ్విన్ జీనియన్‌:పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

81
ashwin

భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు గుప్పించారు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. అశ్విన్ లాంటి వ్యక్తి జీనియస్‌లు చాలా అరుదుగా కనిపిస్తారని పేర్కొన్నారు. అశ్విన్‌…టీమిండియాకు విలువైన క్రికెటర్ అని తెలిపాడు.

ఆల్‌టైం స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరు చాలా అందంగా ఉంటుందని..బౌలర్ గా వికెట్లు పడగొట్టడమే కాకుండా ఐదు టెస్టు సెంచరీలు కూడా నమోదు చేశాడని వెల్లడించాడు. అశ్విన్ అద్భుతమైన స్పిన్నర్… చాలా తెలివిగా బంతిని స్పిన్ చేస్తాడు. విభిన్నమైన యాంగిల్స్ లో ప్రయోగిస్తాడని తెలిపాడు.

అశ్విన్ ఇదే ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ వస్తే ముత్తయ్య మురళీథరన్ రికార్డును బ్రేక్ చేసేయగలడు. పిచ్ వాతావరణానికి తగ్గట్టు బౌలింగ్ వైఖరి మార్చగల నేర్పరరి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.