పాక్ చేతిలో భారత్ ఓటమి..

40
- Advertisement -

కొలంబో వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఏ చేతిలో భారత్ ఏ ఓటమి పాలైంది. దీంతో పాకిస్థాన్ ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. పాక్ విధించిన 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..40 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయి 128 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 61 పరుగులు చేయగా కెప్టెన్ యశ్ ధుల్ 39, సాయి సుదర్శన్ 29 పరుగులు మినహా మిగితా వారు అంతా విఫలమయ్యారు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. పాకిస్థాన్ బౌలర్లలో సూఫియన్‌ ముఖ్వీమ్‌ 3, మెహ్రాన్‌ ముంతాజ్‌, అర్షద్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ వాసిమ్‌ తలో 2 వికెట్లు, ముబాసిర్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

Also Read:మిరియాలతో ఉపయోగాలు..

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన పాక్..50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. తయ్యబ్ తాహిర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

Also Read:టీటీడీ టికెట్ల కోటా విడుదల

- Advertisement -