ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా పాకిస్తాన్‌కి ఇంగ్లాండ్ గట్టి షాకిచ్చింది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఇంగ్లీష్ టీంపై విజయభేరీ మోగించింది. ఇంగ్లాండ్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు ఫఖర్ జమాన్ (57; 58 బంతుల్లో 7×4, 1×6), అజార్‌అలీ (76; 100 బంతుల్లో 4×4, 1×6) అద్భుత అర్ధశతకాలు బాదేశారు. తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించి పాక్ విజయానికి బాటలు వేశారు. వీరికి తోడుగా బాబర్ అజాం 38 , హఫీజ్ 31 రాణించడంతో పాక్ 37. 1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
అంతకముందు టాస్ గెలిచిన పాక్….ఇంగ్లాండ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పాక్ బౌలింగ్ దాటికి చేతులేత్తేశారు. వరుసగా ఒక్కొక్కరు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లకి 211 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు బెయిర్ స్టో 43, హేల్స్ 13 ,రూట్ 46, మోర్గాన్ 33, బట్లర్ కూడా 4 పరుగులకే వెనుదిరిగారు. తర్వాత వచ్చిన స్టోక్స్ 34, అలీ 11, రషీద్ 7, ప్లంకెట్ 9, వుడ్ 3, బాల్ 2 పరుగులు చేశారు.
వీరోచిత ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (34; 64 బంతుల్లో) అంచనాల మేరకు రాణించలేకపోయాడు. 64 బంతులాడి 34 పరుగులే చేశాడు. పైగా అతడి ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేకపోవడం గమనార్హం. పాకిస్థాన్ బౌలర్లలో హాసన్‌కి మూడు వికెట్లు దక్కగా, రయీస్, జునైడ్‌లకి రెండేసి వికెట్లు దక్కాయి. షాదాబ్ ఒక వికెట్ తీశాడు. గురువారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో పాక్ తలపడనుంది.