పాక్ నటులు భారత్‌ రండీ…

221
- Advertisement -

కశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్‌ను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది..గత వారం రోజులుగా దౌత్యపరమైన యుద్ధం చేసిన భారత్ ఇప్పుడు నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది…ఓ రకంగా పాకిస్థాన్ యుద్ధాన్ని మొదలెడితే, ఇప్పుడు ఇండియా మళ్లీ యుద్ధం మాట ఎత్తకుండా చేసేందుకు శత్రుదేశంపై ముప్పేట దాడి చేసేందుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉరీ ఘటనతో ఆగ్రహంతో రగిలిపోతున్న భారత సైన్యం పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతంగా పూర్తి చేసింది. మరోవైపు సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం.

మరోవైపు ఉత్కంఠ కొనసాగుతుండగానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్….పాక్ నటులు భారత్‌కు రావాలని వ్యాఖ్యానించారు.ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులే కదా, పాకిస్థానీ నటీనటులు కాదుకదా! మరి అలాంటప్పుడు నటీనటులపై నిషేధం ఎందుకు?’ అనిప్రశ్నించాడు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానని.. ఇంతటితో ఉరీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనలులపై నిషేధం విధించడం సరికాదన్న ఆయన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు.

సరైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో పాక్ నటులు భార‌త్ కు రావాల‌ని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ క‌ళాకారుల‌కు ఇక్క‌డ నివ‌సించ‌డానికి వాలిడ్ వీసా ఉంద‌ని ఆయ‌న అన్నాడు. ఇరు దేశాల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం ఉండాల‌ని పేర్కొన్నాడు.

- Advertisement -