ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో సునాయస విజయం ద్వారా పాక్ ఫైనల్ చేరుకుంది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 152పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడుగా ప్రదర్శించింది. డారిల్ మిచెల్ (53) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్ (46) రాణించాడు. కానీ మిగతా వారు ఫిన్ అలెన్ (4) పరుగుల వేటలో విఫలమయ్యాడు. డేవిన్ కాన్వే (21), జేమ్స్ నీషమ్ (16) ఫర్వాలేదనిపించాడు.
న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. బాబర్ ఆజామ్ (53), మహమ్మద్ రిజ్వాన్ (57) చెరో హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 12 ఓవర్లు ముగిసేలోపు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 102 పరుగులు చేశారు. 12.4 ఓవర్లో బాబర్ ఆజామ్ అవుటై పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హారిస్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు.
చివరి క్షణాల్లో హారిస్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ క్రీజులో ఉన్న షాన్ మసూద్, అహ్మద్‌లు ఫర్వాలేదనిపించడంతో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పాక్ చేధించింది. తొలి సెమీస్‌లో గెలవడంతో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది.
రెండో సెమీస్ లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. వీరిలో గెలిచిన జట్టుతో నవంబర్ 13న జరిగే మెల్బోర్న్లో పాకిస్తాన్‌తో ఫైనల్ లో తలపడనుంది.
ఇవి కూడా చదవండి..