భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్‌కు సువర్ణావకాశం వచ్చిందని.. టాస్ గెలిస్తే భారత్‌కు బ్యాటింగ్ ఇవ్వద్దంటూ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్‌కు ముందు చేసిన సూచన ఇది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయడం ఖాయమని ఇమ్రాన్ ఖాన్ ముందే పాకిస్తాన్ టీంను హెచ్చరించాడు. అయితే పాకిస్తాన్‌కు అదృష్టం కలిస రావడంతో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ తీసున్నాడు. భారత్ ఓటమికి ఇదే కారణమైంది.
ఇంగ్లాండ్‌లో పిచ్‌ల పరిస్థితులు.. వాతావరణం.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపిస్తున్నాయి. కోహ్లి సైతం ఇదే వ్యూహంతో బౌలింగ్ ఎంచుకోవడం టీమ్‌ఇండియా కొంప ముంచింది. నిజానికి గత రెండ్రోజులుగా లండన్‌లో వర్షం లేదు. పూర్తి ఎండగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి ఎండ ప్రభావం కనిపిస్తుంది. పైపెచ్చు పిచ్ పూర్తి ఫ్లాట్‌గా.. పొడిగా ఉంది. ఇలాంటి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఐతే కోహ్లి టోర్నీలో నడుస్తున్న ఆనవాయితీనే అనుసరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమ్‌ఇండియాకు వూహించని పరాజయం.
టాస్ ఒక్కటే కాదు.. పేలవమైన బౌలింగ్ కూడా టీమ్‌ఇండియా ఓటమికి కారణం. పాకిస్తాన్ ఇంగ్లాండ్‌తో జరిగిన సెమిస్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న పాక్ ఒక్కసారిగా పుంజుకుంది. ఓటమికి మరొక కారణం.. స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ఎంపిక. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌ల్లో అశ్విన్ చేసిందేమీ లేదు.రెండు మ్యాచ్‌లు కలిపి తీసింది ఒక్క వికటే. 10 ఓవర్లు వేసిన అశ్విన్ 70 పరుగులు సమర్పించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్ , జడేజా , కేదార్ జాదవ్ కలిసి 21 ఓవర్లు వేసి 164 పరుగులు ఇవ్వడం గమనార్హం. నిలకడగా రాణిస్తూ.. డెత్ ఓవర్లలో ఆకట్టుకుంటున్న బుమ్రా నోబాల్‌తో సహా ఫైనల్లో టీమ్‌ఇండియా సమర్పించుకున్న అదనపు పరుగులు 25. అందులో 13 వైడ్లు, 3 నోబాల్స్. కీలకమైన ఫైనల్లో ఇంతటి ఘెరమైన బౌలింగ్ కూడా ఓటిమికి కారణమే.