కులగణన కాంగ్రెస్ నైతిక విజయం!

18
- Advertisement -

కులగణన కాంగ్రెస్ పార్టీ నైతిన విజయం అన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తె బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ బీసీ నేతలు.

రాహుల్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన అంశం ఓ చారిత్రాత్మక ఘట్టం అన్నారు. కులగణన సర్వేపై మాట్లాడిన బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి అన్నారు. కులగణన బిల్లు రాష్ట్రపతికి పంపడంపై గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చాం అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. రేవంత్ రెడ్డి చొరవతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన కోసం నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జనగణన తో పాటు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు.

Also Read:హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్

- Advertisement -