పాక్‌లో హంగ్..సైనిక జనరల్ కీలక వ్యాఖ్యలు

20
- Advertisement -

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే జైలులో ఉన్నా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) 98 చోట్ల గెలవగా 69 సీట్లతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌-ఎన్‌ రెండో స్థానంలో, 51 సీట్లతో బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది.దీంతో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో పాక్ సైనిక జనరల్ మునీర్ కీలక ప్రకటన చేశారు. అరాచకం, విభజన రాజకీయాల నుంచి దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 250 మిలియన్ల జనాభా ఉన్న ప్రగతిశీల దేశానికి అరాచకవాద, విభజన రాజకీయాలు సరికాదు అన్నారు. దేశానికి స్థిరమైన చేతులు, స్వస్థత అవసరం అనే ప్రకటన విడుదల చేశారు.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -