ఆసియా కప్ 2023కోసం టీమ్ ఇండియా పాక్ పర్యటనకు వెళ్లకూడదని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆటగాళ్ల భద్రత కూడా ముఖ్యమన్నారు. ఓ ప్రైవేటు ఛానల్‌తో మాట్లాడుతూ…టీమ్ ఇండియా పాకిస్తాన్‌లో పర్యటించకూడదు. అర్థికమాంధ్యంతో అక్కడి ప్రజలే సురక్షితంగా లేరు అలాంటి చోట భారత ఆటగాళ్లను పంపి రిస్క్ తీసుకోవాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ భారత్ కచ్చితంగా టైటిల్ నెగ్గుతుందని భజ్జీ ధీమా వ్యక్తం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం వరుసగా రెండోసారి అని అన్నారు. అలాగే విరాట్ కోహ్లీ మంచిఫామ్‌లో ఉన్నారు. కానీ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోవడం కొంత వరకు బౌలింగ్‌లో కొరత ఉన్న షమీ, ఠాకూర్ మంచి ఫామ్‌లో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే పాక్ ఆటగాడు బాబర్ అజామ్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా భిన్నంగా నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి…