పాక్‌ కూడా ఇలా మాట్లాడదు:సంబిత్‌

43
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంపై బీజేపీ విమర్శించింది. ఇలాంటి వ్యాఖ్యలు పొరుగు దేశం పాక్‌ సైతం ఎప్పుడూ చేయలేదని పేర్కొంది. భారత్‌ గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే…విదేశి గడ్డపై ప్రతిపక్షనేత ఇలా మాట్లాడాతారా అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు.

కేంబ్రిడ్జి యూనివర్శిటీలో 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్యం పడిదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి తమ పెట్టుబడులను భారత్‌కు తరలించాలని పెట్టుబడుదారులు భావిస్తున్న వేళ…వారిని వెనక్కి పంపాలని రాహుల్‌గాంధీ చూస్తున్ఆనరని సంబిత్‌పాత్రా విమర్శించారు. డబ్బులు తీసుకునే ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దేశంలో మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబట్టారు.

భారత్ కీర్తి ప్రతిష్టలను మంటగలిపేందుకు రాహుల్‌ గాంధీ ఆయన కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. జీ20దేశాలకు భారత్‌ అధ్యక్షత వహిస్తున్న వేళ ఈవిమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. తన ఫోన్‌లో పెగాసస్ వైరస్‌ను జొప్పించారన్న ఆరోపణలనూ సంబిత్ పాత్రా ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీకి రాహుల్‌గానీ ఆ పార్టీ నేతలు గానీ పరిశీలించేందుకు ఫోన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. యూపీఏ-2 హయంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేశారని, ఈ-మెయిల్స్‌ను చదివారని ఆర్‌టీఐ దరఖాస్తులో తేటతెల్లమైందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి…

త్వరలో నానో డీఏపీ..కేంద్రం..!

పాదయాత్రల లొల్లి.. కాంగ్రెస్ బలి !

175 డౌటే.. జగన్ తొందరపడ్డారా ?

- Advertisement -