మూత్రవిసర్జనలో మంట వస్తోందా..!

95
- Advertisement -

మూత్రవిసర్జన చేసే సమయంలో మంటగా అనిపిస్తోందా ? మూత్రం లేత ఎరుపు రంగు లేదా ముదురు పసుపు రంగులో వస్తోందా ? అయితే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా లేదా ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ మూత్ర విసర్జన సమస్యలు కూడా అధికం. చాలమంది మూత్రవిసర్జన చేసే సమయంలో మంట లేదా నొప్పితో విపరీతంగా భాదపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే మూత్రవిసర్జనలో మంట లేదా నొప్పి రావడానికి ప్రధానంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ యే అని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన లేదా కటి ప్రాంతంలో రేడియేషన్ థెరఫీ వంటివి తీసుకున్న మూత్ర విసర్జనలో మంట లేదా నొప్పి వస్తుందట.

అలాంటి సందర్భంలో శరీరంలోని చెడు బ్యాక్టీరియా మూత్రాశయం లేదా మూత్రనాళంలోకి చేరుతుంది. ఆ బ్యాక్టీరియా కిడ్నీలోకి చేరుకోవడంతో మూత్ర విసర్జన చేసే సమయంలో మంట లేదా నొప్పి రావడంతో పాటు మూత్రం యొక్క రంగు మారడం, మూత్రంలో వాసన రావడం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే మూత్రం లేత ఎరుపు రంగు లేదా పింక్ కలర్ లో వస్తుంటే మూత్రనాళంలో రక్తస్రావం ఉందని అర్థం అలాంటి సందర్భంలో అస్సలు అశ్రద్ద వహించరాదని వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మనం ఆపరిశుభ్ర ఆహారం తీసుకున్న లేదా ఆ పరిశుభ్ర నీరు త్రాగిన మూత్రంలో కొద్దిపాటి మంట వంటివి గమనించవచ్చు. ఇది డైసూరియాకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం కారణంగానే మూత్రవిసర్జన సమస్యలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించిన లేదా నొప్పిగా అనిపించిన ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు.

 Also Read:విజయ్‌ సేతుపతితో ఆర్జీవీ..మూవీ కోసమేనా!

- Advertisement -