ఒకేసారి ముగ్గురితో విజయ్ దేవరకొండ రొమాన్స్

512
vijay-devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ జోరు మీదున్నాడు. వరసపెట్టి సినిమాలు చేస్తూ హీరోగా తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ యంగ్ హీరో.. ‘గీత గోవిందం’ చిత్రంతో తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు. ఇటీవలే ఈ యువ హీరో నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక త్వ‌ర‌లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయ‌నున్నాడు.

vijay-devarakonda

క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి కథానాయికలుగా నటించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకే హీరోయిన్‌తో రొమాన్స్‌ చేస్తూ వస్తోన్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్‌లతో రొమాన్స్‌ చేయనుండడం విశేషం.

Vijay-Devarakonda-Romance

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకి , హీరోకి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని అందిస్తుంద‌ని చెబుతున్నారు. న‌వ్య‌పంథాలో సాగ‌నున్న అతని పాత్ర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంద‌ట‌. వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న విజయ్‌ దేవరకొండకు ఈ సినిమా ఏ మేరకు విజయాన్నందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -