21న టీఆర్ఎస్‌లోకి కౌశిక్ రెడ్డి..!

186
trs

రేపు(21)న మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతానని వెల్లడించారు పాడి కౌశిక్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన…ప్రతి గ్రామం నుండి 40 నుండి 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. హుజురాబాద్‌ నుండి దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమైన విషయం అన్నారు.

తన మిత్రులు, శ్రేయోభిలాషులతో సంప్రదించి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, ఆస‌రా పెన్ష‌న్లు పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌న్నారు. కాళేశ్వ‌రం, లోయ‌ర్ మానేరు ప్రాజెక్టుల‌తో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ దుర్వినియోగం చేశారని…ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.