విశాల్ ‘ఎనిమీ’ నుండి రొమాంటిక్ సాంగ్‌..

125
- Advertisement -

కోలీవుడ్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎనిమీ’. ఆనంద శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. విశాల్ జోడీగా మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రలో ఆర్య కనిపించనున్నాడు. షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

‘పడదే పడదే పడదే’ అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, పృథ్వీచంద్ర ఆలపించాడు. విశాల్ – మృణాళిని రవిపై ఈ పాటను చిత్రీకరించారు. కొంతకాలం పాటు హీరోయిన్‌గా తన జోరు చూపించి నటనకు దూరమైన మమతా మోహన్ దాస్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -