కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటి..?

109
Minister Errabelli Dayakar
- Advertisement -

కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటి…? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రశ్నించారు. ఈరోజు శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసులో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినమని, తెలంగాణకు నిధులు తెస్తాడని అనుకున్నామని చెప్పారు. బండి సంజయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడినట్లే కిషన్‌ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి అబద్దాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు గత ఏడేండ్లుగా కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి కట్టే పన్నుల్లో సగం కూడా తిరిగి ఇవ్వడంలేదన్నారు.

మిషన్‌ భగీరథను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని, అయినా నీతి ఆయోగ్‌ చిప్పినప్పటికీ భగీరథకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇక్కడి సంక్షేమ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటున్నదని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాలు చేసిందన్నారు.

- Advertisement -