సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి..

205
minister errabelli
- Advertisement -

రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల 50 లక్షలు శనివారం నాడు విడుదల చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫర శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గ్రామపంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు నిధులు విడుదల చేసినట్లుగా వెల్లడించారు. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాకూడ ప్రతినెలా గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ మంత్రి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ స్ధానిక సంస్థలకు ఆర్థికఇబ్బందులు లేకుండా ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రతినెలా గ్రామీణ స్థానికసంస్థలకు రూ.227.50కోట్లను విడుదలచేస్తున్నామని, ఇందులో గ్రామపంచాయతీలకు రూ.210.44కోట్లు, మండల పరిషత్లకురూ.11.41కోట్లు, జిల్లా పరిషత్లకు రూ.5.65కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. గ్రామపంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సదుద్ధేశంతో ప్రణాళిక బధ్ధంగా గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతల సమగ్ర అభివృద్ధియే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నదని అయన అన్నారు. మౌలిక సదుపాయల కల్పన, పచ్చధనం, పరిశుభ్రతలకు ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం అమలు వల్ల రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకుర్చామని ఆయన తెలిపారు. దీనికి తోడుగా ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల వల్ల పల్లెల సమగ్ర స్వరూపమే మారిందని మంత్రి అన్నారు.

- Advertisement -