మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఓయూ వీసీ రవీందర్..

29

ఉస్మానియా యూనివర్సిటీ విసిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కే తారకరామారావును ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా విసి డి. రవీందర్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ సహకారాలు పైన పలు అంశాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

తన పరిధిలో ఉన్న శాఖలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలపై హామీ ఇచ్చిన కేటీఆర్, మిగిలిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే అని ఉస్మానియా యూనివర్సిటీకి పునర్వైభవం తీసుకువచ్చే విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్న వాటన్నిటికీ తమ మద్దతు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విసికి భరోసా ఇచ్చారు.