ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు..

30
AP Corona Cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 88,622 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,981 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 943 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 854, పశ్చిమ గోదావరి జిల్లాలో 593 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 6,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు 12,490 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,67,017 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,04,844 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 49,683 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా తాజాగా న‌మోదైన కొవిడ్ మ‌ర‌ణాల వివ‌రాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అధికంగా 10 మంది చ‌నిపోగా తూర్పుగోదావ‌రి, కృష్ణాలో ఐదుగురు చొప్పున‌, గుంటూరు, నెల్లూరులో న‌లుగురు చొప్పున‌, శ్రీ‌కాకుళం, ప‌శ్చిమ గోదావ‌రిలో ముగ్గురు చొప్పున‌, అనంత‌పురం, క‌డ‌ప‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రంలో ఒక్కో వ్య‌క్తి చొప్పున మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల్లో తూర్పుగోదావ‌రిలో అత్య‌ధికంగా 943 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా చిత్తూరులో 853, ప‌శ్చిమ గోదావ‌రిలో 598, శ్రీ‌కాకుళంలో 500 కేసులు న‌మోద‌య్యాయి.