రైతుకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి

92
minister harish
- Advertisement -

గురువారం సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, చౌడారం గ్రామంలో రూ. 3.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చౌడారం గ్రామానికి డబుల్ లేన్ బ్రిడ్జీ తేవడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. గ్రామాన్ని దశల వారీగా మరింత అభివృద్ధి చేద్దామన్నారు మంత్రి. ఈ వానాకాలం కింద 60 లక్షల 57 వేల 197 మంది రైతులకు రూ. 7178 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రైతు ఎక్కడికీ తిరగకుండా పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

కరోనాతో ఇబ్బంది ఏర్పడినా, ఏం తగ్గినా రైతులకు రైతుబంధు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. నెలకు వెయ్యి కోట్ల రూపాయలు నిరంతర నాణ్యమైన విద్యుత్తు కోసం ప్రభుత్వం చెల్లిస్తున్నది. 7 ఏండ్ల కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండితే, ఈ యేడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇదంతా కాళేశ్వరం జలాలతో సాధ్యమైందన్నారు. రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. ఆయిల్ ఫామ్, మల్బరీ తోటలు-పట్టు సాగు, వరి వెద సాగు విరివిగా చేపట్టాలని చౌడారం గ్రామ రైతులకు అవగాహన కల్పించి ముందుకు రావాలని కోరుతున్నాను. నెత్తిమీద కుండలా రంగనాయక సాగర్ ఉన్నది, పది తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని మంత్రి హరీష్‌ కోరారు.

- Advertisement -