chandrabose:ఆస్కార్‌తో నాటి జ్ఞాపకాలను షేర్ చేసిన బోస్‌.!

21
- Advertisement -

ఎక్కడ జీవిత ప్రయాణం మొదలు పెట్టామో గుర్తుపెట్టుకొని తనకిష్టమైన జీవితాన్ని ప్రారంభించి చివరికి అనుకున్న విజయం చేరుకోగానే మళ్లీ అక్కడికి వెళ్లి తన తీపి గుర్తులను తలచుకోవడం కేవలం కొంతమందికే చెల్లుబాటవుతుంది. అలాంటి వారిలో చంద్రబోస్‌ ఒకరు. సుమారు 28యేళ్ల క్రితం తాను ఎక్కడైతే సినీ ప్రస్థానం(తొలి పాట)మొదలుపెట్టారో అక్కడికి ఆస్కార్‌ను తీసుకెళ్లి ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ కోసం రాసిన నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే రచయితగా తనకు సినిమా రంగంలో పరిచయం చేసిన ప్రముఖ దివంగత నిర్మాత రామానాయుడిని గుర్తు చేసుకుంటూ ఆయన రామానాయుడు స్టూడియోస్‌కు వెళ్లారు.

అక్కడ నిర్మాత సురేష్‌బాబుని కలిసి నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ..సినీ ప్రయాణంలో రామానాయుడు స్టూడియోస్‌ నుంచి మొదలైన నా ప్రయాణం ఆస్కార్ వరకూ వెళ్లిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు ఆశీస్సులు తనపై ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాజ్‌మహల్‌ సినిమా కోసం రాసిన మంచుకొండల్లోన చంద్రమా పాటను ఎం ఎం శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : ముదురు అందాలకు హద్దుల్లేవ్

మంచు బ్రదర్స్ మధ్య ఈ ‘సారథి’ ఎవరు?

నారాయణ &కో..ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -