మంచు బ్రదర్స్ మధ్య ఈ ‘సారథి’ ఎవరు?

17
- Advertisement -

మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మనోజ్ వద్ద పని చేసే సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టడానికి వచ్చాడు. ఆ సమయంలో మనోజ్ అక్కడే ఉండడంతో.. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, మంచు బ్రదర్స్ గొడవపై మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో పెట్టడంపై మనోజ్ పై మోహన్‌ బాబు సీరియస్ అయ్యారని సమాచారం.

కాగా, సారథి ఇంట్లో ఏం జరిగిందంటూ మోహన్‌బాబు ఆరా తీసి.. ఫేస్‌ బుక్‌ లో వీడియో తొలగించాలని మనోజ్‌ను ఆదేశించాడు అని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో గొడవకు సంబంధించిన వీడియోని మనోజ్ వెంటనే తొలగించాడు. అసలు ఈ సారథి ఎవరు అంటే.. విష్ణు ఫిల్మ్ కెరీర్ ప్రారంభం నుంచి అతని వెన్నంటే ఉండి.. ఇటీవల మనోజ్‌కు సారథి దగ్గరయ్యారు. విష్ణుకి ఎంతో నమ్మకంగా పని చేసి.. సడెన్ గా విష్ణు దగ్గర నుంచి మనోజ్ దగ్గరకు వెళ్ళడం, అలాగే ఆస్తుల పంపకాల విషయంలో మనోజ్ కి కొన్ని సలహాలు ఇస్తున్నాడట.

మొత్తానికి తమ మధ్య విబేధాలకు కారణమవుతున్నాడని.. సారథి ఇంటికి వెళ్లి విష్ణు దాడి చేశాడు. ఘర్షణ వద్దని సారథి వేడుకున్నా.. విష్ణు వినకుండా చావబాదినట్టు తెలుస్తోంది. ముఖంపై బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు సారథి. విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి, మనోజ్‌ తో పాటు ఆస్పత్రికి చేరుకుని.. అతనికి దైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ఈ గొడవలో మంచు లక్ష్మి.. మనోజ్ కే సపోర్ట్ చేస్తునట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

నారాయణ &కో..ఫస్ట్ లుక్ విడుదల

ustad:సెట్స్ పైకి పవన్ ఉస్తాద్.. డేట్స్ ఫిక్స్

Pooja Hegde:పూజా హెగ్దే ప్రేమ పురాణం మళ్లీ వైరల్

- Advertisement -