‘ఒరేయ్‌ బుజ్జిగా’ ట్రైలర్..

198
Orey Bujjiga

టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ సినిమా ట్రైలర్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ఈ రోజు విడుదలైంది. రాజ్‌తరుణ్‌ జోడీగా హెబ్బాపటేల్ మరోసారి ఈ సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నరేశ్, వాణీ విశ్వనాథ్‌‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర కీలక ప్రాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా బృందం తెలిపింది. ఈ సినిమాకు విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన హెబ్బా పటేల్‌తో పాటు మాళవికా నాయర్‌ కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు నాగ చైతన్యకు రాజ్‌ తరుణ్‌ శుభాకాంక్షలు తెలిపాడు.

Orey Bujjiga Trailer | 4K | Raj Tarun, Malvika Nair, Hebah Patel | World Premiere on AHA