సుకుమర్‌తో విజయ్ దేవరకొండ మూవీ..

257
Vijay Devarakonda

టాలీవుడ్‌ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సుకుమార్ పుష్ప చిత్రంతో బిజీగా ఉండ‌గా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ చిత్రం చేస్తున్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత కేదార్ సెల‌గం శెట్టి మాట్లాడుతూ : “ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022లో మొదలు కాబోతుంది. ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం.” అని అన్నారు.