రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల..

374
farm loan waiver issued
- Advertisement -

రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి జారీ చేశారు. రూ.1 లక్ష లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేయనుంది ప్రభుత్వం. 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు. బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్ట్ వ్యవసాయ శాఖ తయారు చేయనుంది.

అయితే పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీ ( హైదరాబాద్ )లో తీసుకున్న లోన్లు రుణమాఫీకి వర్తించవు. కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా..ఒక్కరి రుణం మాత్రమే మాఫీ అవుతుంది. అందులో కేవలం రూ.1 లక్ష మాత్రమే మాఫీ. తొలి దశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ అవుతాయి.

- Advertisement -