ఇప్పటి వరకు రైలు బండిలో ప్రయాణం చేయడమే తెలుసు. కానీ ఇప్పుడు రైలు బండి రెస్టారెంట్‌లో భోజనం తీసుకు వస్తుంది. రెస్టారెంట్‌లో సర్వర్ చేయాల్సిన పనిని రైలు బండి కూతపేడుతూ ఫుడ్ తీసుకు వస్తుంది. టెబుట్ నంబర్ ప్రేస్ చేస్తే ఆ టేబుల్‌కు సర్వ్ చేస్తుంది. నిజామాబాద్ నగరంలో ప్రారంభమైన జంక్షన్ 65 రెస్టారెంట్‌లో రైలు బండే ప్రత్యేకత. రెస్టారెంట్‌లో సర్వర్లు ఆహారాన్ని తీసుకువచ్చి ఇస్తారు.
కానీ జంక్షన్ 65 రెస్టారెంట్‌లో మాత్రం రైలు ఆ పని చేస్తుంది. రెస్టారెంట్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన రైల్వే బోగి భోజన ప్రియులకు స్వాగతం పలుకుతోంది. కస్టమర్లు టేబుల్ వద్ద కూర్చుని వారికి కావాల్సిన ఆహర పదార్థాలను ఆర్డర్ తీసుకుంటారు. కొత్తదనం ఉట్టిపడేలా ఆర్డర్ చేసిన ఆహారాన్ని రైలు పెట్టెలో తీసుకువచ్చి భోజన ప్రియులకు అందిస్తారు.
ఈ జంక్షన్ 65 రెస్టారెంట్‌లో చిన్న పిల్లలు ఆనందంగా రైలు బండిని చూస్తూ సంతోషంగా, ఉత్సాహంగా రెస్టారెంట్ రుచులను ఆస్వాదిస్తున్నారు. ఈ రైలు బండి హోటల్‌కు జనం క్యూ కడుతున్నారు. కస్టమర్లు ఎప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. హైదరాబాద్ వంటి మహానగరం తరువాత నిజామాబాద్ నగరంలోనే ఇలాంటి రెస్టారెంట్ ఉంది. ట్యూబ్‌లో చూసి ఇంటి టెక్నాలజీతో నిజామాబాద్‌లో జంక్షన్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని కార్తీక్ తెలిపారు. యూట్యూబ్‌లో చూసి ఇంటి టెక్నాలజీతో నిజామాబాద్‌లో జంక్షన్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని కార్తీక్ తెలిపారు. జర్మనీ నుంచి పరికారలాను తీసుకుచ్చామని అన్నారు. చిన్న రైలింజన్ కిచెన్‌లో ఆహారం గిన్నెలు పెట్టి టెబుల్ నంబర్ నోక్కితే ఆ టెబుల్‌కు వెళుతుందని తెలిపారు. దీంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కార్తీక్ చెబుతున్నారు.