రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్…

130
- Advertisement -

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వాతావరణ శాఖ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని…రాత్రి టైంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. 40 ఏళ్లలో ఈ స్థాయిలో వానలు ఎప్పుడూ కురవలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. తెల్లవారు జాము నుంచి ముసురు వాన పడుతోంది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మలక్ పేట్, ఎల్బీనగర్, కోఠి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.

- Advertisement -