ఒరాకిల్..భారీ లేఆఫ్స్!

7
- Advertisement -

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం Oracle Corporation భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆస్టిన్ కేంద్రంగా ఉన్న ఒరాకిల్ సంస్థ సంస్థాగత మార్పుల పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాలను సరళీకరించడానికి కొన్ని పదవులను రద్దు చేస్తున్నామని ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.

ఈ లేఆఫ్స్‌లో భారత్‌లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. ఇంకా ఒక నెలలో మరో విడత తొలగింపులు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.ఒరాకిల్ సంస్థలో భారత్‌లో మొత్తం సుమారు 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ సంఖ్యలో పెద్ద భాగం ప్రభావితమవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి కంపెనీ కొన్ని ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నట్లు సమాచారం:

ఒక నెల నోటీస్ పీరియడ్ జీతం
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
అర్హత మేరకు గ్రాట్యుటీ
అదనంగా రెండు నెలల జీతం (టాప్-అప్)

Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

అయితే, స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వారికే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని తెలుస్తోంది.ఒరాకిల్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,62,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు (మే 2025 నాటికి). ఈ భారీ లేఆఫ్స్ టెక్ రంగంలో మరోసారి అనిశ్చితిని పెంచుతున్నాయి.

- Advertisement -