సరదా ప్రాంక్‌లతో ఏప్రిల్ ఫూల్స్ డే!

4
- Advertisement -

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న జరుపుకునే April Fools’ Day సందర్భంగా కార్యాలయాలు, తరగతి గదుల్లో సరదా వాతావరణం నెలకొంటుంది. అయితే సరదా పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, సురక్షితంగా నవ్వులు పంచే ప్రాంక్‌లు చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని సరదా ఫ్రాంక్‌లను గమనిస్తే..

ఫైనల్ ఎగ్జామ్ లింక్ ప్రాంక్: పరీక్షల సమాధానాలు అని చెప్పి ఒక లింక్ పంపి, అది ఫన్నీ వీడియోకు వెళ్లేలా చేయడం.

క్లాస్‌రూమ్ మార్పు: మరో క్లాస్‌తో సమన్వయం చేసుకుని గదులు మార్చడం ద్వారా టీచర్‌ను కాసేపు కన్ఫ్యూజ్ చేయడం.

స్టిక్కీ నోట్ మెసేజ్: “నన్ను దాటేటప్పుడు చప్పట్లు కొట్టు” లాంటి చిన్న సందేశాన్ని విద్యార్థి వెనుక పెట్టడం.

బోర్డ్‌పై ఫన్నీ టాపిక్: క్లాస్ ప్రారంభానికి ముందు బోర్డ్‌పై కాస్త విచిత్రమైన పాఠ్యాంశం రాయడం.

స్టిక్కీ నోట్ డెస్క్: డెస్క్, కీబోర్డ్, మౌస్‌ను స్టిక్కీ నోట్స్‌తో కవర్ చేయడం.

గూగ్లీ ఐస్ ప్రాంక్: స్టేప్లర్, మగ్, మానిటర్‌లపై చిన్న కళ్ల స్టిక్కర్లు పెట్టడం.

వాయిస్ యాక్టివేటెడ్ సైన్: ప్రింటర్ లేదా కాఫీ మెషీన్‌పై “వాయిస్‌తో పనిచేస్తుంది” అని బోర్డ్ పెట్టడం.

డెస్క్ మార్చడం: వస్తువులను కొంచెం మార్చి “ఏదో తేడా” అనిపించేలా చేయడం.

ఫ్రోజన్ డెస్క్‌టాప్ ట్రిక్: స్క్రీన్‌షాట్ తీసి వాల్‌పేపర్‌గా పెట్టి ఐకాన్‌లు దాచడం.

మౌస్ ప్రాంక్: మౌస్ సెన్సార్ కింద చిన్న కాగితం పెట్టి పని చేయకుండా చేయడం.

Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

ప్రాంక్‌లు ఎంత సరదాగా ఉన్నా, సందర్భాన్ని బట్టి అవి మారాలి. స్నేహితుల మధ్య పనిచేసేది, కార్యాలయంలో లేదా క్లాస్‌లో సరిపోకపోవచ్చు. ఏప్రిల్ ఫూల్స్ డేలో చేసే సరదా చివరికి అందరూ కలిసి నవ్వుకునేలా ఉండాలి. ఎవరికైనా అసౌకర్యం కలిగించే ప్రాంక్‌లను తప్పించుకోవడం మంచిది. అందుకే సరదా, సురక్షితమైన ప్రాంక్‌లతో ఈ ఏప్రిల్ ఫూల్స్ డేను ఆనందంగా జరుపుకోండి.

- Advertisement -