26న రైతుల నిరసన…విపక్షాల మద్దతు

157
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే నిర్వహించనున్నాయి సంయుక్త కిసాన్ మోర్చా. ఈ నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సంయుక్త ప్రకటనపై సోనియా గాంధీ(కాంగ్రెస్),హెచ్ డీ దేవెగౌడ(జేడీఎస్),శరద్ పవార్(ఎన్​సీపీ),మమతా బెనర్జీ(టీఎంసీ),ఉద్దవ్ ఠాక్రే(శివసేన), ఎం కే స్టాలిన్(డీఎంకే),అఖిలేష్ యాదవ్(ఎస్పీ),తేజస్వీయాదవ్(ఆర్జేడీ),హేమంత్ సోరెన్(జేఎంఎం),ఫరూక్ అబ్దుల్లా(జేకేపీఏ),డీ రాజా(సీపీఐ),సీతారాం ఏచూరి(సీపీఐ-ఎం)సంతకం చేశారు.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధత కల్పించాలని విపక్షాలు లేఖలో పేర్కొన్నాయి. ఢిల్లీలోకరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున సాగు చట్టాలపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. హర్యాణా గ్రామీణ ప్రాంత రైతులు భారీగా టిక్రీ సరిహద్దు వద్దకు తరలివస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని భారతీయ కిసాన్​ యూనియన్​ హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ తెలిపారు.

- Advertisement -