ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు: విజయసాయి

40
vijayasai reddy

ఏపీలో ఉన్న ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు? ” అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోందన్నారు. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో? అంటూ ఎద్దేవా చేశారు.