బిహార్‌లో విపక్షాల భేటీ..

50
- Advertisement -

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు ఇవాళ ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో పలు విపక్ష పార్టీలు భేటీ కానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతుండగా సుమారు 18పార్టీల ప్రతినిధులు హాజరవుతారని అంచనా.

Also Read:ఢిల్లీకి మంత్రి కేటీఆర్..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ నుంచి నితీశ్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, సీపీఐ నుంచి డీ రాజా, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ , ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే, కేరళ కాంగ్రెస్, విసికే, ఆర్ఎస్పీ తో పాటు మరికొన్ని పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.

Also Read:CMKCR:తెలంగాణలో ఎకరం.. ఆంధ్రాలో 100 ఎకరాలకు సమానం

- Advertisement -