నూతన పార్లమెంట్‌ ఓపెనింగ్‌కు విపక్షాలు బాయ్‌కట్‌

58
- Advertisement -

ఈనెల 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కనపెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని స్వయంగా ప్రారంభించాలనుకోవడం ప్రధాని మోదీ చర్య వల్ల రాష్ట్రపతికి ఘోరమైన అవమానంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు దేశంలోని 19విపక్ష పార్టీలు సుదీర్ఘమైన వివరణతో కూడా లేఖను విడుదల చేశారు.

ఇందులో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (UBT), కేరళ కాంగ్రెస్ (మణి),  విదుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండిఎంకే, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని అన్నారు. దీనికి తగిన ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నామని అన్నారు.

 రాష్ట్రపతి మనదేశంలో దేశాధినేత మాత్రమేకాదు పార్లమెంట్‌ల్లో అంతర్భాగం కూడా అని లేఖ పేర్కొన్నారు. రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాల నిర్వహణ మరియు ప్రోరోగ్ చేస్తుంది. అలాగే పార్లమెంట్‌లో ప్రసంగిస్తుంది. రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలనుకోవడం రాష్ట్రపతి పదవిని అవమానిస్తోందని అన్నారు. ఈ చర్య వల్ల రాజ్యంగ స్పూర్తిని ఉల్లంఘిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మొదటి మహిళా ఆదివాసి రాష్ట్రపతిని నియమించుకున్నామనే స్పూర్తిని ఈ చర్య వల్ల బలహీనపరుస్తోంది. పార్లమెంటరీ కమిటీలు ఆచరణాత్మకంగా పనికిరాకుండా పోయాయి.

Also Read: ‘మీటింగ్ టైమ్’ బీజేపీలో కలవరం పోతుందా?

కొత్త పార్లమెంట్‌ భవనం శతాబ్దానికి ఒకసారి చాలా ఖర్చుతో నిర్మించబడింది. కరోనా లాంటి కష్ట కాలంలో ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా చాలా ఖర్చు చేసి నిర్మించిన ఈ కొత్త భవనంలో ప్రజాస్వామ్య ఆత్మ ఉండదని తెలిపారు. అందుకే ఈ కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని మా సమిష్టి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ నిరంకుశ ప్రధాని మోదీకి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అన్నారు. మా సందేశాన్ని ప్రజలకు నేరుగా వినిపిస్తామని లేఖలో పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !

- Advertisement -