UPA కాదు.. ఇక INDIA!

41
- Advertisement -

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ఏకం అవుతున్న విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడేందుకు గత కొన్నాళ్లుగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల ఐక్యతకు వేగంగా అడుగులు పడ్డాయి. కాగా విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడేందుకు నిన్న మరియు నేడు బెంగళూరు లో దాదాపు 26 విపక్ష పార్టీల అధినేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో పని చేసిన యూపీఏ కూటమిని పేరు మార్చి ” INDIA ” నామకరణం చేశారు ఇండియా అనగా ” ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్ క్లుసివ్ అలయెన్స్ ” అనే అర్థం వచ్చేలా విపక్షాల కూటమికి పేరు పెట్టారు.

Also Read:దీంతో చెడు కొలెస్ట్రాల్ మటుమాయం!

దీంతో 2004 లో ఏర్పడిన యూపీఏ కూటమికి నేటితో కాలం చెల్లింది. ఇకపై INDIA పేరుతో ఎన్డీయే కూటమిని విపక్షాలు ఢీ కొట్టబోతున్నాయి. అయితే ఈ కూటమి ఎవరి నేతృత్వంలో పని చేయబోతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం విపక్షలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ కంటే.. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. అందువల్ల INDIA కూటమిపై నితిశ్ ఆధిపత్యం ఉంటుందా లేదా గత యూపీఏ కూటమిలో మాదిరి కాంగ్రెస్ పార్టీనే ముఖ్య భూమిక పోషిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనప్పటికి మోడిని గద్దె దించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న విపక్షాలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.

Also Read:

చూపులతో పిచ్చెక్కిస్తున్న కృతి!

- Advertisement -