ప్రతిపక్ష నాయకులే తమ ప్రభుత్వ బాండ్ అంబాసిడర్లని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఐటీ, పరిశ్రమ రంగాలపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే రంగంలో ఐటీ, పరిశ్రమల రంగం ఒకటి అని చెప్పొచ్చు. మన రాష్ట్రానికి జరుగుతున్న మంచి పనులను రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే స్వాగతించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష నాయకులే తమకు బ్రాండ్ అంబాసిడర్లు అని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు వారు చేస్తున్న పాదయాత్రల్లో భాగంగా వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోల్లో కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయన్నారు.
ఒకాయన నిరుద్యోగ గర్జన, మరొకరు మిలియన్ మార్చ్ చేస్తామని అంటారు. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో అసాధారణ అభివృద్ధి జరిగిందన్నారు. సాగునీటి రంగంలో సాధించిన విజయాలను కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారని తెలిపారు.ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు కల్పించాలి తప్ప వేరే దారి లేదన్నారు.