14 జిల్లాల్లో రెడ్ అలర్ట్….

40
red alert

గులాబ్ తుఫాను కార‌ణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇవాళ తెల్ల‌వారుజాము నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ప్రజలు భయటకు రావొద్దని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ 14 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. నిర్మ‌ల్, నిజామాబాద్, కామారెడ్డి, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల‌కు రెడ్ అలర్ట్ హెచ్చ‌రిక‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ జారీ చేసింది. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.