NCERT సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 3 నుంచి 12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది NCERT.ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు విడుదల చేశారు అధికారులు.
3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్(ఎ సాగా ఆఫ్ వాల్యూర్), 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్(ఎ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ) టైటిళ్లతో పాఠ్యాంశాలు ఉండనున్నాయి.
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్‌ను సిలబస్‌లో చేర్చుతున్నట్లు ఎన్‌సీఈఆర్టీ తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనకున్న లక్ష్యమని తెలిపింది. అలాగే ఆదిత్య ఎల్1 చంద్రయాన్ అంతరిక్ష మిషన్‌లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:KTR:చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి

