మాస్క్ లేకుండా వస్తే.. జైలు శిక్షే

346
kejriwal
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ముఖానికి మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చే వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కులు ధరించకుండా అధికారులు మీటింగులు నిర్వహించకూడదని సూచించారు.

ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 200 నుంచి రూ. 1000 వరకు జరిమానా కూడా విధించనున్నట్టు తెలిపారు.

- Advertisement -